జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందించాలని కలెక్టర్కు వినతి.

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి/
యాదాద్రి భువనగిరి జిల్లా;
జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో ఉచిత విద్య అవకాశం కల్పించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతికి టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18న సోమవారం వినతి పత్రం అందజేయడం జరిగింది . కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోఐజెయు కౌన్సిల్ నెంబర్ యంబ.నరసింహులు టియుడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి వెలిమినేటి జహంగీర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరాఠీ రవి, జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి మల్లేశం, జిల్లా కార్యవర్గ సభ్యుడు m.వెంకటేశం, పట్టణ శాఖ అధ్యక్షుడు పోతంశెట్టి కరుణాకర్, కార్యదర్శి ఎండి జమాల్, సీనియర్ జర్నలిస్టులు చెన్నయ్య, కందుల శ్రీనివాస్, ఇబ్రహీం, సమీర్, నరసింహ చారి, బుగ్గ శ్రీనివాస్, నరేందర్, కిషన్, కుమార్, శ్రీనివాస్ ,నరసింహ, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.