ఈ ఆడపిల్లల చదువుల బాధ్యత నాదే… ఐలయ్య

రాయల్ పోస్ట్ న్యూస్:యాదగిరిగుట్ట పట్టణంలో ఇటీవల ఇంటి స్లాబ్ కూలి మృతి చెందిన సుంకి ఉపేందర్ ఇద్దరు కుమార్తెలను 10 వరకు చదివించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్చార్జి బీర్ల ఐలయ్య తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్ల నివాసంలో సుంకి ఉపేందర్ భార్య స్వాతి తన పిల్లలను తీసుకొని వచ్చి ఐలయ్యను కలిశారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమ పిల్లల చదువులకు సహకరించాలని వేడుకొన్నారు. మా కుటుంబ దీనస్థితిని గమనించి వెంటనే మానవత హృదయంతో స్పందించిన ఐలయ్య పిల్లల చదువులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. యాదగిరిగుట్టలోని విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాల యజమాన్యంతో మాట్లాడారు. ఉపేందర్ కుమార్తెలు కిరణ్మయి, దీక్షిత చదువులకు సహకరించాలని దీక్షితకు 10 వరకు ఉచిత చదువు చెప్పాలని పాఠశాల యజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఐలయ్య విజ్ఞాపనను పాఠశాల యాజమాన్యం అంగీకరించగా కిరణ్మయి పదో తరగతి వరకు చదువుకునేందుకు అవసరమైన ఫీజులు, పుస్తకాలు తాను భరిస్తానని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఈరోజు కిరణ్మయి తల్లి స్వాతికి అందజేశారు.
ఆడపిల్లల చదువుకు సహకరించిన ఐలయ్యకు ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడ్ల వరలక్ష్మి నాయకులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.