రైతు వ్యతిరేకి బిజెపి

రాయల్ పోస్ట్ ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ వాకిలి శుభ్రం చేసుకోవడానికి చేతకాదు కానీ ఊరంతా శుభ్రం చేయడానికి వచ్చినట్టు బిజెపి వ్యవహారం ఉందని, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి విమర్శించారు, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము పరిపాలిస్తున్న రాష్ట్రంలో ప్రజలు రైతులు కార్మికులు విద్యార్థులు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని బిజెపి పాలిత ప్రభుత్వాలు, తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే కళ్ళున్న కబోదిల బిజెపి కేంద్ర మాజీమంత్రి ప్రస్తుత ఎంపీ గురువారం నారాయణఖేడ్ కు వచ్చిన సందర్భంగా తెలంగాణ గురించి మాట్లాడటం ఆస్యాస్పదం ఉందన్నారు, ఆసరా పింఛన్ రూపాయలు 3000/లు ఉంటే కర్ణాటకలో రూపాయలు, 600, 1000లు ఉందన్నారు నాగలిగిద్య మండలం సరిహద్దుల్లోని కర్ణాటక ప్రజలు తాగునీరు లేక కరస్ గుత్తి మిషన్ భగీరథ నీటిని తీసుకువెళ్తున్నారు, కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మమ్మల్ని తెలంగాణలో విలీనం చేయాలంటూ సరిహద్దు ప్రజలు కోరుతున్నారని గుర్తు చేశారు2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ నల్లధనాన్ని తప్పించి ప్రతి పేదవాడి జన్ధన్ ఖాతాలో 15 లక్షల లు జమ చేస్తామని తెలిపి నోరుమూలపడం లేదన్నారు,2019లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని హామీ ఇచ్చి చివరకు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతులను కొట్టించారు అన్నారు, రాబోయే ఎన్నికల్లో బిజెపికి సింగల్ డిపాజిట్ కూడా రాదని ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది టిఆర్ఎస్ అన్నారు, తాండూరు బిజెపి ఫ్లోర్ లీడర్ బిజెపిని విడి కేటీఆర్ ఆధ్వర్యంలో బీజేపీ కండువా వేసుకోవడం టిఆర్ఎస్ విజయానికి సూచన అన్నారు ఇప్పటికైనా బిజెపి నాయకులు తెలంగాణలో తమ స్థాయిని తెలుసుకొని మాట్లాడాలి అన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రూబీ నా బేగం నజీబ్ వైస్ చైర్మన్ విజయ్ నాయకులు అభిషేక్ అంబదాస్ రవీందర్ పార్టీ పట్టణ అధ్యక్షులు నగేష్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.