పాఠ్యపుస్తకాలు,స్కూల్ యూనిఫాం అందించడంలో ప్రభుత్వం విఫలం-NSUI

రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూరు ఎం: విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,స్కూల్ యూనిఫాం అందించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్ ఎస్ యు ఐ అధ్వర్యంలో నిరసన చేపట్టి తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం అయి 20 రోజులు గడుస్తున్నా నేటికీ పాఠశాల విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు కానీ స్కూల్ యూనిఫాం గానీ అందించలేని దుస్థితిలో నెలకొని ఉండటం సిగ్గుచేటు అని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పాఠశాలల ప్రారంభానికి ముందే ప్రతి మండల విద్యా శాఖ కార్యాలయంలకి చేరుకునేవని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రభుత్వ వైఫల్యం కారణంగా పూర్తీస్థాయిలో మండల విద్యాధికారులు లేకపోగా పాఠశాలల విద్యా వ్యవస్థ కుంటుపడే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం తక్షణమే పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫాంలను అందచేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మండల తహశీల్దార్ జయమ్మకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్,కార్యదర్శి పల్సం మహేష్ గౌడ్,పట్టణ అధ్యక్షులు లోడి మహేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షులు ఎలిమినేటి స్వామి,నాయకులు జెట్ట అనిల్,గడ్డం ఉదయ్,కందడి మధు,దేవరకొండ పవన్,ఎలిమినేటి అభినయ్, పంజాల వివేక్,పాశం మణికంఠ,ఎలగందుల పవన్, ఎలగందుల సాయి,పబ్బతి ప్రవీణ్,కోరే లింగస్వామీ,బుషిగంపల లోకేష్,కోరే శశి,ఉగ్గే ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.