నేటి నుంచి ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం బంద్
రాయల్ పోస్ట్ ప్రతినిధి: నారాయణఖేడ్ మున్సిపాలిటీలో శుక్రవారం నుండి ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడం మానుకోవాలని, నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ జి మల్లారెడ్డి అన్నారు, ఆయన విలేకరులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా, జులై 1 నుండి కేంద్రం ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు నిర్ణయించింది అన్నారు, 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవాటి నీ, సింగల్ యాజ్ కవర్లు అంటారు, కేంద్రం నిబంధనలు ఉల్లంఘించిన వారికి, 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష ఒక లక్ష జరిమానా లేదా రెండు విధించే అవకాశఉందన్నారు, మున్సిపల్ చట్ట ప్రకారం జరిమానా రూపాయలు 500 నుండి రూపాయలు 25 000 విధించినట్లు అన్నారు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు.