కనిపించే వైద్యోనారాయణుడు డాక్టర్ విజయ భార్గవ్….

రాయల్ పోస్ట్ న్యూస్: అంతర్జాతీయ డాక్టర్స్ డే ను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విజయ భార్గవ్ సార్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్నాక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్, 26వ వార్డ్ కౌన్సిలర్ ఈరపాక నరసింహాలు మాట్లాడుతూ నేటి సమాజంలో వైద్యం అంటేనే డబ్బుతో కూడుకున్నదని డబ్బులు లేనిదే ప్రాణాలు దక్కలేనటువంటి పరిస్థితులలో భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్ విజయ భార్గవ్ గారు ఒక పేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వం సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ హాస్టల్లో విద్యను అభ్యసించి హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి కనిపించే దైవం డాక్టర్ విజయ భార్గవ్ గారిని ఆ తరుణంలోనే మహాత్మా గాంధీ హాస్పిటల్ వరంగల్ లో ప్రొఫెసర్గా పదోన్నతి పొంది యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందిస్తూ ఎవరు ఏ సమయంలోనైనా అర్ధరాత్రి సమయంలో కూడా వైద్యం పరంగా సలహాలు సూచనలు అడిగిన సందర్భంలో తక్షణమే స్పందించి పేద ప్రజలకు ప్రాణాలు దక్కే విధంగా పెద్ద ఆసుపత్రులలో కూడా తనకు ఉన్నటువంటి సంబంధాలతో తక్కువ డబ్బులు ఖర్చు అయ్యే విధంగా చేసి ప్రజలను కాపాడుతున్నటువంటి గొప్ప వైద్యులు డాక్టర్ విజయ భార్గవ్ గారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ చిన్న, బింగి నరేష్, సురుపంగ చందు, శేఖర్, అశోక్ రెడ్డి, రావుల రాజు, ముబీన్ తదితరులు పాల్గొన్నారు.