అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ నీటి పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేయాలి – పొత్నక్ ప్రమోద్ కుమార్

రాయల్ పోస్ట్ న్యూస్:పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని కాలనీ వాసులతో కలిసి వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటి పైప్ లైన్ కోసం త్రవ్విన రోడ్లు నాలుగు నెలలుగా కాంట్రాక్టర్, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలు నానా అవస్థలకు గురై సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, చిన్నపిల్లలు బాటసారులు, రాత్రి వేళల్లో మోటర్ సైకిళ్లపై గుంతలు ఏర్పడ్డదాంట్లో పడి ప్రమాదాలకు గురైనారు. ఇట్టి విషయంలో సంబంధిత అధికారులు ఏఈ నాగప్రసాద్, సూపర్వైజర్ చాగంటి సురేష్, మున్సిపల్ కమిషనర్, డీఈలకు విన్నవించిన స్పందన లేని కారణంగా ఈరోజు కాలనీవాసులతో కలిసి అసంపూర్తిగా ఉన్న పైప్ లైన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సోమవారం వరకు పూర్తి చేయనట్టయితే పెద్ద ఎత్తున మిషన్ భగీరథ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ ఇరపాక నరసింహ, వార్డు ప్రజలు బింగి నరేష్, భూపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటేష్, పాలడుగు శేఖర్, బొక్క జనార్దన్ రెడ్డి, నారాయణ, రాజ్ కుమార్, నెలిగొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.