మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

BJP రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ గారితో, బండి సంజయ్ గారి తో దాదాపు 45 నిమిషాలు కొండా భేటీ అయ్యారు. సమావేశంలో డైరెక్ట్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మాట్లాడించారు రాష్ట్ర నేతలు. మంచి రోజు చూసుకొని రేపు లేదా… ఎల్లుండి నడ్డా సమక్షంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలోకి చేరాలని తరుణ్ చుగ్, సంజయ్ తన ఇంటికి వచ్చి కోరారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే జాయిన్ కావాలా తర్వాత జాయిన్ కావాలా అనే విషయంపై ఆలోచిస్తున్నామని చెప్పారు.