ప్రైవేటు పాఠశాల బస్సును వెనక్కి పంపిన బేగంపేట గ్రామస్తులు…..

రాయల్ పోస్ట్ ప్రతినిధి 29 జూన్ /రాజాపేట మండల కేంద్రంలోని మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల బస్సును బేగంపేట గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం వెనక్కి పంపారు పాఠశాల కరస్పాండెంట్ దురుసు ప్రవర్తన అడ్డగోలుగా ఫీజు వసూలు గత సంవత్సరం నాలుగు నెలలు పాఠశాల నడవగా సంవత్సరం ఫీజు వసూలు చేయడం పేరెంట్స్ పట్ల కనీస గౌరవమర్యాద లేకపోవడం పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయకపోవడం గ్రామంలోని సమీప గ్రామాల్లోని ప్రైవేట్ పాఠశాలలను ఒక్కడే అద్దెకు తీసుకోవడం ఇతర విషయాలపై ఆగ్రహం చెందిన బేగంపేట గ్రామానికి చెందిన సుమారు 30 మంది విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామానికి వచ్చిన బస్సును వెనక్కి పంపి పాఠశాలకు పంపబోమని గ్రామానికి రావాల్సిన అవసరం లేదని వారు చెప్పారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆరోపించారు మద్యం వ్యాపారంతో విద్యాలయాలను మాంటిసోరి స్కూల్ కరెస్పాండెంట్ పోల్చడం అత్యంత బాధాకరమని వారు అన్నారు తమ గ్రామంలోని వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్చునట్లు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు ఈ విషయంపై సింగారం గ్రామస్థులు కూడా పాఠశాల యాజమాన్యం తో వాగ్వివాదం చేసినట్లు తెలిపారు జిల్లా విద్యాధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది