పేద ప్రజలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి ప్రవేశిస్తాం
బట్టుపల్లి అనురాధ(సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు)

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:తెలంగాణ రాష్ట్రం వస్తే పేదల బ్రతుకులో వెలుగులు వస్తాయని అనేక కలలుగన్న ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదని ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి ప్రజలను సమీకరణ చేసి ప్రవేశిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అన్నారు బుధవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేటికీ పేద ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన వృద్ధులకు పెన్షన్లు దళితులకు మూడు ఎకరాల భూమి నేటికీ నీటి మూటగా మిగిలిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అనేకమంది అర్హులు 2017 సంవత్సరంలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న నేటి వరకు ఇచ్చిన పాపాన పోలేదని వారన్నారు పేద ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నిరంకుశ పాలన సాగిస్తున్నారని వారు అన్నారు అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు మాట్లాడుతూ భువనగిరి పట్టణ కేంద్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ముందు ముందు ఉదృత పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు వీరితో పాటు సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, గంధమల్ల మాతయ్యపట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బర్ల వెంకటేష్ ,వనం రాజుపట్టణ కమిటీ సభ్యులు బందెలఎల్లయ్యా, వెళ్దాసు అంజయ్య ,కల్లూరి నాగమణిచింతల శివ
చింతల సత్యనారాయణవనం, గిరిగందమళ్ళ బాలమణిఅంబటి లలిత, దండు యాదగిరి తదితరులు పాల్గొన్నారు