గూడూరు నారాయణ రెడ్డి గారిచే శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులకు బహుమతుల ప్రదానం :
రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలలో శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్ధులు విజయకేతనం ఎగురవేశారు. గూడూరు నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు జిల్లా ర్యాంకులు సాధించడంలో శ్రీ వాగ్దేవి No.1 అని అన్నారు.
ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు గూడూరు నారాయణ రెడ్డి గారు గోల్డ్ మెడల్ తో సత్కరించినారు. కళాశాల చైర్మన్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థుందరికీ శుభాకాoక్షలు. తెలియజేశారు. మొదటి ర్యాంకు సాధించిన శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల బైపిసి విభాగంలో 440 మార్కులకు పిట్టల మాయూరికి 431 మార్కులు, రెండవ ర్యాంకు దరిపల్లి తన్వి శ్రీ అక్షర 427 మార్కులు సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్ కొలను శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ 400 పైన మార్కులకు 15 మంది ఘనవిజయం సాధించడం గర్వించదగిన విషయం అని అన్నారు.BiPC విభాగంలో వరుసగా R. పూజ 425 ,B. ప్రణతి 419 R. శివాని413 MPCవిభాగంలో వరుసగా A. ప్రవళిక 424 D. అలేఖ్య413
CEC ఈ విభాగంలో M. మణికంఠ 402 సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి కృప డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ యాకూబ్ బాబా, వైస్ ప్రిన్సిపాల్ రాము వాగ్దేవి కళాశాల వైస్ ప్రిన్సిపల్ మహేందర్, శేఖర్, నరేందర్ రెడ్డి, బిక్షపతి, వీరయ్య , శ్రీనివాస్ ,మోహిన్ మాధవి ,దీపిక చైతన్య ఈ కార్యక్రమములో శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాకులు పాల్గొన్నారు.