అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు జారీ…… అదనపు కలెక్టర్ రాజర్షి షా

రాయల్ పోస్ట్ ప్రతినిధి సంగారెడ్డి : జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరీ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రాజార్షి షా పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం బుధవారం అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన ఆయన ఛాంబర్లో నిర్వహించారు

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు 2022 -2024 సంవత్సరాలకు సంబంధించి జారీ చేయవలసిన కొత్త అక్రిడిటేషన్ కార్డుల విషయమై అదనపు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి, చర్చించిన మీదట కమిటీ చైర్మన్ హోదాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లల మంజూరీకి ఆమోదం తెలిపారు. ఇ.వి సత్యనారాయణ, కమిటీ సభ్యులు ఎం. ఎ. కె. ఫైసల్, కరుణాకర్ రెడ్డి, యోగానంద రెడ్డి, శ్రీధర్, ప్రభాకర్, డేవిడ్ రాజ్, శివ ప్రసాద్, హరికృష్ణ, పాల్గొన్నారు.