తీపి జ్ఞాపకాల మధ్యలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం
భువనగిరి పట్టణంలోని బీచ్ మహళ్లా పదవ తరగతి ఉన్నత పాఠశాల 2004-05 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు పాఠశాల ఆవరణలో తీపి జ్ఞాపకాల మధ్య నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులు సాల్వేరు సత్యనారాయణ, వీపూరి శ్రీధర్, సామల మాణిక్యం, సత్తయ్య,నాజీనాబేగం తదితరులను ఘనంగా సన్మానించడం జరిగింది*
అనంతరం ఒకరికొకరు వారి వ్యక్తిగత కుటుంబ వృత్తిపరమైన వివరాలు తెలుసుకుంటూ ఆనందోత్సవాల మధ్య సమ్మేళనాన్ని ఘనంగా నిర్వ హించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హబీబ్ దండు నరేష్, దర్గాయి గణేష్, శ్యామ్ గౌడ్, శ్రీను, సామల రాజు,పెంబర్తి మహేష్ సుధాకర్ మహేష్ భాస్కర్ మల్లేష్ నాగచందర్ ఉపేందర్ లెనిన్ రమేష్ సాగర్ వెంకటేష్ రమేష్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు