రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: బొందుగుల గ్రామం, రాజపేట మండలలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొందుగుల నారాయణరెడ్డి విగ్రహవిష్కరణను బొందుగుల వెంకటేశ్వరరెడ్డి ఆవిష్కరణ చేశారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతు ఆరుట్ల కమలాదేవి,రామచంద్రారెడ్డి లాగా నాయకులూ వుండాలి. నారాయణరెడ్డి ప్రజల కోసం బతికిన మనిషి అని తెలిపారు, అలాంటి నాయకులు మనకి కావాలి, అలాంటి నాయకునీ విగ్రహవిష్కరణ రావడం చాలా ఆనందంగా వుంది అని తెలిపారు. పల్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణకు వల్లభాయ్ పటేల్ ద్వార వచ్చిందని అంటారు కానీ అది నిజం కాదు తెలంగాణా వచ్చింది కమ్యూనిస్టు పార్టీ వల్ల ఇది అసలు నిజం, ఈ రోజు కొందరు చరిత్రను వక్రీరిస్తున్నారు అని తెలిపారు, అలాగె నారాయణరెడ్డి ప్రజల కోసం బతికిన మనిషి, తన జీవితం ప్రజా సేవకే అంకితం చేసిన నారాయరెడ్డిగారి విగ్రహ ఆవష్కరణకు రావడం సంతషంగా వుంది అని అన్నారు, స్ధానిక ఎమ్మెల్యే గోంగిడి సునిత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణరెడ్డి లాంటి నాయకుల నా నియోజకవర్గం లో వున్నారు అని తెలిసీ చాలా ఆనందంగా వుంది అలాగె వారి స్ఫూర్తి నీ తీసుకొని మరింత ప్రజలకు అందుబాటులో ఉండి వారికీ కావలసిన పనులు చేస్తాను అని తెలిపారు, అలాంటి వ్యక్తుల భావజాలాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డి , అలేర్ మాజి ఎమ్మెల్యే జెడ్పీటీసి నగేష్, కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి,పల్ల వెంకటరెడ్డి, రత్నాకర్ aituc నాయకులు, cpi మండల కార్యదర్షి చిగుళ్ల లింగం, బి.ఆదినారాయణ, కమ్యూనిస్ట్ నాయకులు కార్యకర్తలు, మరియు కుటుంబసభ్యులు, తెరాస నేతలు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.