రాయల్ పోస్ట్ ప్రతినిధి:సంగారెడ్డి, జూన్ 21:–

జిల్లాలో మన ఊరు మన బడి లో ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులను వేగవంతంగా చేయాలి

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు- మన బడి

పనులు నాణ్యతగా చేయాలి

అలసత్వం నిర్లక్ష్యం వహిస్తే సహించం
….. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పేర్కొన్నారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనుల పురోగతి పై విద్యాశాఖ అధికారులు, సంబంధిత ఇంజనీరింగ్ ఏజెన్సీలతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన ఏజెన్సీ వారిగా చేపట్టిన పాఠశాలల పనులు, పరిపాలన, సాంకేతిక అనుమతులు, కేటగిరీ వారీ పనులు, ఈజీఎస్ కింద చేపట్టిన పనులు, ఖర్చు అంచనా లు, పూర్తయిన పనులు, 30 లక్షల లోపు పనులు, 30 లక్షలకు పైబడిన పనుల పురోగతి తదితర వివరాలను ఆరా తీశారు.

జిల్లాలో మొదటి విడత గా ఎంపికైన 441 పాఠశాలల్లో పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, జాప్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

పూర్తి చేసిన పనులకు కాంట్రాక్టర్లు/ఏజెన్సీలకు డబ్బు చెల్లించాలన్నారు. ఈజీఎస్ లో
ఎస్టి మేషన్ జెనరేట్ చేసి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈజీఎస్ కింద చేపట్టిన పనుల గ్రౌండింగ్ వారంలోగా పూర్తి కావాలన్నారు.

మంజూరైన పనులన్నింటిని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ప్రధానోపాధ్యాయులు, ఎం ఈ ఓ లు ఏజెన్సీ ల వెంటబడి పనులు నాణ్యతగా చేయించుకోవాలని సూచించారు. నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షణ జరగాలని తెలిపారు.

అన్ని ప్రాజెక్టులకు పరిపాలన, టెక్నికల్ మంజూరి కావాలన్నారు. పనులు ముందు చేసిన వారికి ముందుగా డబ్బులు వస్తాయని తెలిపారు. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

మన ఊరు- మన బడి కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ నెల 30న మరోమారు సమావేశం నిర్వహిస్తామని, ఆలోగా 90 శాతం పనులు పూర్తి కావాలని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీలకు ఆదేశించారు.

విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ ఏజెన్సీలు సమన్వయ సహకారాలతో పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు.

ఈ సమీక్షలో డీఈవో రాజేష్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, టి ఎస్ ఈ డబ్ల్యు ఐ డి సి శాఖల అధికారులు, ఎం ఈ ఓ లు, తదితరులు పాల్గొన్నారు.