రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

రాయల్ పోస్ట్ ప్రతినిధి

మోటార్ సైకిల్ ను డీ కొన్న లారీ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని కాల్ టెక్స్_చెంద్రా పూర్ ప్రధాన రహదారి పై మంగళవారం మధ్యాహ్నం మోటారు సైకిల్ ను లారీ డీ కొన్న సంఘటన లో పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి మండలం గుంపుల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి చెంద గా మారో వ్యక్తి తీవ్రంగా గాయ పడ్డాడు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం గుంపుల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ సొ త్కు సుదర్శన్ (40) మందమర్రి పట్టణం లోని సెకండ్ జోన్ లో గల తన అత్త వారింటికి సోమ వారం వచ్చాడని ఎస్సై తెలిపారు.మృతునికి భార్య ఉందన్నారు.మంగళవారం బెల్లంపల్లి కాల్ టెక్స్ లో గల అతని స్నేహితుడు తిరుమల చారి ని కలిసేందుకు సుదర్శన్ తన బావమరిది ఎడ్ల సంతోష్ తో కలిసి మోటార్ సైకిల్ కిల్ పై వచ్చి నట్లు ఎస్సై పేర్కొన్నారు.తిరుమల చారి ని కలిసి మందమర్రి వైపుకు వస్తుండగా వెనక వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ మోటార్ సైకిల్ ను డీ కొందని ఎస్సై తెలిపారు. ఈ సంఘటన లో రిటైర్డ్ ఆర్మీ జవాన్ సుదర్శన్ అక్కడి కక్కడే మృతి చెందాడని, అతని బావమరిది ఎడ్ల సంతోష్ నడుముకు తీవ్ర గాయాలు కావడం తో మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్ కు తగిలినట్లు ఎస్సై తెలిపారు.సుదర్శన్ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.