నారాయణఖేడ్ డివిజన్ వ్యాప్తంగా 22 నా విద్యుత్ సరఫరా నిలిపివేత
రాయల్ పోస్ట్ ప్రతినిధి : నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్, మనూర్, సిర్గాపూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, కంగ్టీ, మండల పరిధిలో 22 అనగా బుధవారం నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్ కో ఆపరేషన్ ఏ ెఇ, శివకుమార్ తెలిపారు, మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నారాయణఖేడ్ పట్టణంలోని, 132/11 విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు చేపడుతున్నారు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ మరియు నాణ్యమైన సేవలు అందించేందుకు బుధవారం నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. డివిజన్ పరిధిలోని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుని సహకరించగలరని, ఏ డి ఈ, పి వి మోహన్ కృష్ణ కాంట్రాక్టర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు