అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి .టీ జె యూ డిమాండ్

రాయల్ పోస్ట్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా :భువనగిరి పట్టణంలోని మాధవ రెడ్డి మైనార్టీ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబా అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాష్ట్ర సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మరియు ఐఎఫ్ డబ్ల్యూ జే యూ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా జారీ చేసిన అక్రిడేషన్ కోసం జర్నలిస్ట్ అప్లై చేసుకోవాలని ,చేసుకున్న ప్రతి ఒక్కరికీ జర్నలిస్ట్ కార్డులు ఇవ్వాలని అదేవిధంగా గతంలో జారీ చేసిన విదంగా అందరికి కార్డులు జారిచేస్తూ నూతన నిబంధనలను తొలగించాలని లేనిపక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ కాజా ఫసిఉద్దిన్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య ,జనగామ జిల్లా అధ్యక్షుడు రమేష్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ,
యాదాద్రి జిల్లా జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్న బత్తిని మత్యాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపారాజు వెంకన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ లావణ్య ,జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ ఖదీర్ ,రషీద్,శ్రీనివాస్,జిల్లా వర్కింగ్ సెక్రెటరీ నరేష్, ప్రచార కార్యదర్శి బైరపాక సీరిల్, జిల్లా కార్యవర్గ సభ్యులు రేహమాన్,ఆత్మకూరు అధ్యక్షుడు నవీన్,గుండాల అధ్యక్షుడు నరేష్, పోచంపల్లి అధ్యక్షుడు జగన్, తుర్కపల్లి అధ్యక్షుడు బురాన్,బొమ్మలా రామారం అధ్యక్షుడు విజయరాజ్,ఆలేరు అధ్యక్షుడు ఖాసీం,కార్యదర్శి నరేష్,టి జె యూ సభ్యులు అజిజ్,మహేందర్,రవి,తదితరులు పాల్గొన్నారు.