అగ్ని పద్ ను రద్దు చేయాలి
టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగా స్వామి
ఆలేరు జూన్ 21, రాయల్ పోస్ట్ ప్రతినిధి….
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్ని పదును రద్దు చేయాలని టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగా స్వామి అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా సైన్యంలో ఎటువంటి రిక్రూట్మెంట్లు లేవని. సాయుధ బలగాల్లో కి రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకు రావడం సరికాదన్నారు. దీంతో కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేసి సాయుధ బలగాలు లోకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని కోరారు