రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని యోగా కార్యక్రమంను జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆద్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్, యాదగిరిగుట్ట నందు ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమాములో కే ధనంజనేయులు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి,యాదాద్రి భువనగిరి జిల్లా గారు సుమారు 30 ని,, పైగా యోగా ఆసనాలను చేయిoచినారు ఇందులో ప్రదానంగా ప్రాణాయామం, కపాలభాతి, వజ్రాసనము కు సంబందించిన విషయాలు మరియు మెడిటేషన్ ను కూడా హాజరైన అభ్యర్డులచే చేయిoచినారు అలాగే ఆసనాలు వలన ఉపయోగాలు ఒక్కొక్క ఆసనం వేయడం ద్వార వారికీ వుండే ఉపయోగాలు క్లుప్తంగా తెలియచేయడం జరిగినది అలాగే ప్రతి మానవుని శరీరములో సూక్ష్మ మరియు స్తూల అనే రెండు రూపాలు ఉంటాయని రెండు రూపాలు కలసి చేసే ప్రతి పని కూడా విజయాన్ని చేకూరుస్తుంది అని తెలిపినారు దీని వలన ఏకాగ్రత కూడా ఏర్పడుతుందని యోగా మన శరీరానికి మానసిక మరియు శారీరక వ్యాయామము అని ప్రతి ఒక్కరు కూడా వారి జీవితములో యోగాను భాగస్వామ్యం చేసుకొని ప్రతి రోజు ఒక గంట సేపు యోగా కు సమయం కేటాయించి ఆరోగ్యవంతులుగా జీవించాలని వారు అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో కే ధనంజనేయులు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా, నవ భారత యువజన సంఘం అధ్యక్షుడు కారుణ్, సిబ్బంది సిలివేరు సైదులు, మురళి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ యాదగిరిగుట్ట సిబ్బంది పాల్గొన్నారు.