సూర్యపేట జిల్లా కి వ్యవసాయ కళాశాల & పరిశోధనా స్థానము ఏర్పాటు చేయాలి అని మంత్రి కి వినతిపత్రం

రాయల్ పోస్ట్ ప్రతినిధి సూర్యాపేట: నూతనముగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ రంగం & దాని అనుబంధ రంగాలైనటువంటి ఉద్యానవన , పశుసంపద , డైలీ , మత్స్య తత్సంబంధమైన అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా సూర్యపేట జిల్లాలో వ్యవసాయి కళాశాల & వ్యవసాయ పరిశోధనస్థానము ఏర్పాటు చేయాలి అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబొయిన కిరణ్, AISF జిల్లా ఉపాధ్యక్షుడు గోపగని రవి , RVSP రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ లు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన వ్యవసాయ కళాశాల మరియు పరిశోధన స్థానం కొరకు దాదాపుగా 200 నుండి 250 ఎకరాలు ఖాళీగా ఉన్నటువంటి , నీటి వనరులు సమద్ధిగా ఉన్న ప్రాంతంలో స్థాపించవలసిన అవసరం ఎంతగానో ఉంది . శరవేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు , మనుషుల దిన దినం ఆహరపు అలవాట్ల శైలి , వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులు వాటి పరిష్కారం కోసం దక్షిణ తెలంగాణా మండలం, మధ్య తెలంగాణా మండలం ల వాతావరణము, నేలలు, వర్షపాతం దగ్గర సంబంధించిన వ్యవసాయ పరిశోధనలను నూతనముగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ పరిశోధన స్థానం ను ఏర్పాటు చేసి వేగవంతం చేయవలసిన అవసరం ఎంతోగానో ఉంది. కష్టపడి పంట పండించిన రైతుకు మద్దతు ధరను అందుబాటు తెచ్చేవిధంగా ( పంటల ప్రణాళిక ) మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటరు (వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ) సూర్యపేట జిల్లాలో ఏర్పాటు చేయాలి.
ఇలా ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత రైతు సోదరులకు ఎంతో మేలు చేకూరుతుంది . వ్యవసాయి కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా వివిధ జిల్లాలు మరియు వివిధ రాష్టాలు ( ICAR కోటా ద్వారా విద్యార్థిని ,విద్యార్థులు ఇక్కడ ఏర్పాటు చేసిన నూతన వ్యవసాయ కళాశాలలో అడ్మిషన్ పొంది ఇక్కడి సామాజిక , ఆర్థిక , వాతావరణం స్థితిగతుల పై అవగాహన పొందుతారు.
వ్యవసాయo ఉన్నత విద్య లో భాగమైన M.Sc. ( అగ్రికల్చర్ ) P.HD ( అగ్రికల్చర్ ) లో జాతీయ స్థాయి లో ప్రవేశాలు పొంది ఇక్కడి వాతావరణకులత ఆధారంగా పంటల పై పరిశోధనలు చేయటానికి ఆస్కారము ఏర్పడుతుంది .
వ్యవసాయ విస్తరణ విభాము , వ్యవసాయ ఆర్థిక శాస్త్రము ( అగ్రికల్చర్ ఎకనామిక్స్ వంటి విభాగాలు భారత వ్యవసాయ పరిశోధనా మండలి వారి సౌజన్యంతో వివిధ ప్రాజెక్ట్ లను పొంది పంటలు , గ్రామాల్లో సర్వేలను చేసి యువత , మహిళల , రైతుసోదరులకు ఆర్థికలాభం , చేకూరే విధంగా తొడప్పడుతారు. పంటల సాగు , ఎరువుల మోతాను , పంటలకు నష్టం చేకూర్చే ( కీటకాలు , తెగ్ళుపై పరిశోదనలు ,హైడ్రోపోనిక్స్ , పట్టుపురుగుల పెంపకం, తేనె తీగల పెంపకం, వ్యవసాయ విధాన పద్ధతులపై పరిశోధనలు , పంటల సాగు పై వాతావరణ ప్రభావం పరిశోధనలు ,నేల , నీరుకు సంబంధించిన పరీక్ష పలితాలు , విత్తనోత్పత్తి , సీడ్ ప్రాసెసింగ్ ,పుట్టగొడుగుల పెంపకం , అటవీ వ్యవసాయం ,
మెట్టు సాగులో మెలకువలు
సూక్ష్మసేద్యం , ( బిందుసేద్యం , స్ప్రింక్లర్ ) వర్మి కంపోస్ట్ ( వానపాముల ద్వారా సేంద్రియ ఎరువులు ) సేంద్రియ వ్యవసాయంలో వాడే , జీవన ఎరువులు తయారీ వాటి వాడకం , ప్రకృతి వ్యవసాయంలో వాడే వివిధ మిశ్రమాల తయారీ వాడకం , పశుగ్రాసాల పెంపకం, పశు పోషణ, పాల ఉత్పత్తి , గొర్రెలు , మేకల పెంపకం , ఉద్యాన పంటల ఉత్పత్తుల
ద్వారా ఉప ఉత్పత్తుల తయారీ , రైతు సోదరులకు పంట సాగాలకు ఉపయోగపడే యాంత్రికరణ పనిముట్లు , డ్రోనోటేక్నాలజీ , నీటి సాగు విధానం , అగ్రి టూరిజం ,ఆగ్రో ఫారెస్ట్రీ ,కూరగాయలు , పండ్ల తోటలు వాతావరణం పై ఆధారపడే అంశాలు , పంటలలో వివిధ వంగడాల అభివృద్ధి ,రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతాలలో యువత ఆర్థిక స్వావలంభన కొరకు చేసే కార్యక్రమాలు విజయవంతం కావాలంటే పైనా పేర్కోన్నటువంటి వివిధ అంశాలపై సమగ్రంగా అవగాహన కలిగిన అధ్యాపక , పరిశోధన శాస్త్రవేత్తలు అవసరం ఈ ప్రాంతానికి మరియు ఇక్కడ ఉత్పత్తి అయే పంట ఉత్పత్తులు దేశ జనాబాకు ఆహరకోరత మరియు వివిధ పోషకాల కొరతను అధిగమించేందుకు విధంగా మానవులలో కలిగే వ్యాధుల ద్రుష్ప భావాలు కలగకుండా ఉండే విధంగా నూతన సాగు పద్ధతులు రకాల అభివృద్ధి జరగాలి అంటే సూర్యపేట జిల్లా కి వ్యవసాయ కళాశాల, పరిశోధన స్థానం ఏర్పాటు చేయాలిని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని కోరారు. ఈ కార్యక్రమంలో చమకూరి మహేందర్ , సాయి , సురేష్ తదితరులు పాల్గొన్నారు.