బడులు తెరిచి పుస్తకాలు మరిచిన రాష్ట్ర ప్రభుత్వం…… అతహర్ వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు………….

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:సోమవారం నుండి పాఠశాలలు తెరిచి ఇంత వరకు ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయలేని హీన స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతహర్ మీడియాలో మాట్లాడుతూ కేసీఆర్ విద్యా వ్యవస్థను చిన్నా భిన్నం చేయడమే కాకుండా పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం ప్రజలకు పూర్తి ఉచిత విద్య అందించాలనే అంశం ప్రభుత్వాలు మరిచిపోతున్నాయని అన్నారు. ప్రజలకు కావలసిన నాణ్యమైన ఉచిత విద్య అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అతహర్ అన్నారు.పాఠశాలలకు విద్యార్థులు రాక ముందే ప్రతి పాఠశాల నుండి ఏ తరగతి లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అని సూచిక తెప్పించుకుని వారికి సరిపడా పుస్తకాలు సమాకూర్చాలానే ఆలోచన ప్రభుత్వానికి లేదా అని అతహర్ ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పుస్తకాలు అందించాలని అతహర్ డిమాండ్ చేశారు…