పెంచినటువంటి బస్ చార్జీలను, విద్యార్థుల బస్ పాస్ ఛార్జ్ లను వెంటనే తగ్గించాలి – బండారు ప్రశాంత్ రెడ్డి. NSUI రాష్ట్ర కార్యదర్శి
రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్: మోత్కూర్ మండల కేంద్రంలో NSUI ఆధ్వర్యంలో బస్ చార్జీలను విద్యార్థుల బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని స్థానిక బాస్స్టాండ్ రోడ్డు పైన ధర్నా నిర్వహించడం జరిగింది..అనంతరం
NSUI రాష్ట్ర కార్యదర్శి బండారు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో డీజిల్ సెస్ పేరుతో విద్యార్థుల బస్ పాస్ ఛార్జ్ లను 3 రేట్లు పెంచి విద్యార్థులను చదువుకు దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ప్రతి గ్రామంలో హైస్కూల్, మండలంలో ఇంటర్ డిగ్రీ కాలేజీలు, జిల్లా కేంద్రం లో పీజీ కాలేజీ లను నిర్మించకుండా పేద విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్లి చదువుకుందాం అంటే అమాంతం బస్ పాస్ రేట్లను పెంచడం సిగ్గుచేటన్నారు ,ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల దగ్గరనుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వానికి పట్టింపులేకుండా, విద్యార్థుల మీద మరో పెను భారంగా బస్ ఛార్జ్ లను పెంచడం చాలా బాధాకరమన్నారు
కరెంట్, డీజిల్, పెట్రోల్, నిత్యావసరాల రేట్లను పెంచి ఇప్పుడు బస్ ఛార్జ్ లను పెంచి సామాన్యుడి నడ్డి విరగకొడుతున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో విద్యార్థులే బుద్ధిచెపుతారన్నారు…..
నెలకు 165 రూ” ఉన్న బస్ పాస్ ను ఏకంగా 450 రూ” కు పెంచడం
ఉద్యోగుల నోటిఫికేషన్ సమయంలో విద్యార్థులు చదువుకోసం దూర ప్రాంతాలు పయనిస్తుంటారు కావున ఇలాంటి సమయంలో ఇటువంటి తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని TRS ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం…
ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్ పాస్ ఉన్నట్టు మన తెలంగాణలో కూడా విద్యార్థులకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని NSUI తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు….
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కారుపోతుల వెంకన్న గౌడ్ గారు, మైనారిటీ నాయకులు MD. సమీర్, SK. బాబర్, NSUI జిల్లా కార్యదర్శి నగేష్ గౌడ్, NSUI మండల నాయకులు నిమ్మల శ్రీను యాదవ్, బీసు రాహుల్, బుర్ర సాయి, ప్రశాంత్, చిన్నీ, జాని, అశోక్,నర్సింహ తదితరులు పాల్గొన్నారు.