రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ఇండియన్ ఏయిర్ ఫోర్స్, 12 వ ASC ఎంపికలు నిమిత్తం వింగ్ కమాండర్ గారు జిల్లా కలెక్టర్ గారితో సమావేశం
తేది : 15-06-2022 రోజున ఇండియన్ ఎయిర్ ఫోర్సు, 12 ASC, సికింద్రాబాద్ వింగ్ కమాండర్ సజ్జ శ్రీ చైతన్య గారు జిల్లా కలెక్టర్ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో శ్రీ కే ధనంజనేయులు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి, శ్రీమతి సాహితి, జిల్లా ఉపాది కల్పనా అధికారి, శ్రీమతి రమణి, ఇంటర్మీడియట్ నోడేల్ అధికారి గారు పాల్గొనారు.
ఇట్టి సమావేశంలో వింగ్ కమాండర్ సజ్జ శ్రీ చైతన్య మాట్లాడుతూ భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది అని త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది అని దేశంలో అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌టించారు అని ఈ మేరకు కేబినెట్‌ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2023 జూలై నాటికి అగ్నిప‌థ్ స్కీమ్ కింద దేశంలోని 45వేల మంది యువతను ర‌క్ష‌ణ ద‌ళంలోకి తీసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్నట్టు తెలిపారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వ‌య‌సులోపు వారే దీంట్లో ఉంటారు అని ఎయిర్ ఫోర్సులో యువ‌త‌ను నింపాల‌న్న ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఇందులో పురుషులు మాత్రమే అర్హులు అని అనంతరం మహిళలకు కూడా అవకాశం కల్పిస్తామని తెలిపినారు అలాగే ఇంటర్ మరియు పాలిటెక్నిక్ చదివిన వారు అర్హులు అని సైన్యం లో వుండి చనిపోయిన వారికీ 48 లక్షల రూపాయల జీవిత భీమ ఉంటుది అని కొత్త టెక్నాల‌జీతో యువ‌త‌కు శిక్ష‌ణ ఇచ్చి అగ్నిప‌థ్ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్ల పాటు యువ‌త‌ను భార‌త త్రివిధ ద‌ళాల్లో జాయిన్ చేసుకోవ‌డ‌మే ప్ర‌ధాన ఉద్దేశం అని ఈ ప‌థ‌కం కింద ఉద్యోగంలో చేరిన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు అని ఉద్యోగం కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో అగ్ని వీర్లకు 30వేల నుంచి 40వేల రూపాయల జీతం లభిస్తుంది అని ఎంపికైన వారికి 6 నెలల వరకు శిక్ష‌ణ ఉంటుంది అని నాలుగేళ్ల త‌ర్వాత కేవ‌లం 25 శాతం మందిని ఎయిర్ ఫోర్సు లోకి రెగ్యుల‌ర్ క్యాడ‌ర్‌గా తీసుకుంటారు అని వాళ్లు మాత్ర‌మే తదుపరి 15 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో ఉంటారు అని మిగతా 75 శాతం వాళ్ల‌కు సుమారుగా 11.71 ల‌క్ష‌లు చేలిస్తారని తెలియజేసారు.
జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఈ జిల్లా లోని ఇంటర్మీడియట్ మరియు పాలిటెక్నిక్ అర్హత కలిగిన యువత అత్యదిక సంఖ్యలో ఈ యోక్క అవకాశం వినియోగించుకోవాలని ఇండియన్ ఎయిర్ ఫోర్సు లో చేరాలని తెలిపినారు.
ఈ కార్యక్రమములో 12 వ ASC, సికింద్రాబాద్ వింగ్ కమాండర్ సజ్జ శ్రీ చైతన్య గారు, శ్రీమతి పమేలా సత్పతి, జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా గారు, శ్రీ కే ధనంజనేయులు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి, శ్రీమతి సాహితి, జిల్లా ఉపాది కల్పనా అధికారి, శ్రీమతి రమణి, ఇంటర్మీడియట్ నోడేల్ అధికారి, ఎయిర్ ఫోర్సు సిబ్బంది రాజేష్, యువజన సంఘాల నాయకులు కరుణ్ పాల్గొన్నారు. కే ధనంజనేయులు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా.