రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:సోనియా గాంధీ రాహుల్ గాంధీ లపై ఈడీ విచారణకు నిరసనగా బిజెపి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం……… పట్టణ కాంగ్రెస్ ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎయిర్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇడి విచారించడం నిరసిస్తూ నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గాంధీ కుటుంబానికి ఆస్తులు పదవులు అక్కర్లేదని ఆ కుటుంబం త్యాగాల కుటుంబం అని అనేక మార్లు రుజువైందని ఇప్పటికే పలు చోట్ల జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అనే భయంతో అక్రమంగా ఈడీ నోటీసులు ఇచ్చిందని ఏదైనా కేసులో పోలీస్ స్టేషన్ కు పిలిపిం చాలాన్న ఎఫ్ఐఆర్ నమోదు అయి ఉండాలని నేషనల్ హెరాల్డ్ కేసులో కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఈ డి ఏకంగా విచారణకు పిలిపిం చాచడం అంటే గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చడం మాత్రమే అని తెలంగాణ ఇచ్చిన సోనియా ను ఈడీ విచారణకు పిలిస్తే ఊరుకోమని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని ఉద్దేశంతో కుట్రపూరితంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాబోయే రోజుల్లో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి పార్టీకి భయం పట్టుకుందని రేపు రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ ఎక్కడ ఓడిపోతుందని భయంతో గాంధీ ఫ్యామిలీ పై కక్షపూరితంగా కేసులు నమోదు చేసి అడ్డదారిన మళ్లీ అధికారంలో రావాలని చూస్తున్న ఈ బిజెపి ప్రభుత్వాన్ని త్వరలో ఈ దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వెంటనే ఈడీ విచారణ ఉపసంహరించుకోవాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసు కుంట్ల సత్యనారాయణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోతునక్ ప్రమోద్ కుమార్ మాజీ పిసిసి కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ డిసిసి ప్రధాన కార్యదర్శి md.mazhar నూచ్చు నాగయ్య పిట్టల బాలరాజ్ ఎండి బబ్లు కౌన్సిలర్లు కైరం కొండ వెంకటేష్ md.నజీమా సలావుద్దీన్ కృష్ణ యాదవ్ కోళ్ల గంగాధర్ ఎండి షరీఫ్ కూర వెంకటేష్ ఎండి రఫీ ఉద్దీన్ గౌరీ md.awais chisthy డా కూరి ప్రకాష్ సయ్యద్ రషీద్ హుస్సేన్ సర్పంచ్ రాజు శివ కుమార్
జిట్టా మల్లారెడ్డి ఎండి బుర్హాన్ అలీ కొల్లూరి రాజు తాడూరి నరసింహ పి మల్లేశం md.ఏజాజ్ గుర్రాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు