వెయ్యేళ్ల తోరణాన్ని కాపాడుకోవాలి
ప్రముఖ చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
ఆలేరు జూన్ 14, రాయల్ పోస్ట్ ప్రతినిధి….
కొలనుపాక శివారులో గల వెయ్యేళ్ల నాటి తోరణం వంగి పోతోంది అని. అది కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని అని పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వై టి డి ఎ ఆధ్వర్యంలో కొలనుపాక సోమేశ్వర ఆలయ పరిరక్షణ పనుల పర్యవేక్షణ లో భాగంగా మండలంలోని కొలనుపాక శివారులో గల తోరణాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొలనుపాక సోమేశ్వర ఆలయం తోరణం కంటే ముందే ఈ తోరణం ప్రాచీనమైనదని. కళ్యాణి చాళుక్యుల తొలి పాలనా కాలంలో ఈ తోరణం. కొలనుపాక దేవాలయానికి స్వాగత తోరణంగా ఉండేదన్నారు. వెయ్యేళ్ళ చరిత్ర గల కళ్యాణ చాళుక్యుల తొలి తీరం తోరణం స్తంభాలు ఒంగి నేడో రేపో కూల టానికి సిద్ధంగా ఉన్నాయని వాటిని సత్వరమే పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట వాస్తుశిల్పి శ్రీలేఖ ఉన్నారు