వానాకాలం పంటల సాగుపై అవగాహన
ఏ డి ఏ వెంకటేశ్వరరావు
ఆలేరు జూన్ 14, రాయల్ పోస్ట్ ప్రతినిధి….
వానాకాలం పంటల సాగుపై మంగళవారం మండలంలోని సారాజిపేట రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ డి ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… రైతులకు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసినట్లయితే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరువాక శాస్త్రవేత్త మధు శేఖర్. మండల వ్యవసాయ అధికారి పద్మజ. ఏ ఈ ఓ లు శివ కుమార్. నాగార్జున. శాలిని. రైతులు పాల్గొన్నారు