రక్తదానం చేయడానికి యువత ఉత్సాహం చూపాలి
దరిపల్లి నవీన్ కుమార్ (వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్)( చైర్మన్) & ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (వైస్ చైర్మన్ )యాదాద్రి భువనగిరి జిల్లా

రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి:యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏరియా హాస్పిటల్ వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం రక్తదాన శిబిరం ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు రక్త దానం ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రమీల సత్పతి గారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారిని అభినందించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం ఎంతో ఆనందకరంగా ఉందని అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని అత్యవసర పరిస్థితులో అనారోగ్యంతో రక్తం కోసం బాధపడుతున్న ప్రజలకు రక్తదానం ద్వారా రక్తం అందించవచ్చని వారన్నారు అందుకు యువత రక్త దానం చేయడంలో ముందు ఉండాలని వారు కోరారు… ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ లక్ష్మీ నరసింహ రెడ్డి , రెడ్ క్రాస్ యాదాద్రి భువనగిరి జిల్లా వైస్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మరియు రెడ్ క్రాస్ సభ్యులు , యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.