తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 22,662 కరోనా పరీక్షలు నిర్వహించగా, 219 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 76 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 7,94,803 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,89,433 మంది ఆరోగ్యవంతులయ్యారు. అటు, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 1,259 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.