రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రించాలని పంచాయితీ లో తీర్మానం చేస్తాం…….. ఎలిమినేటి చిన్న కృష్ణారెడ్డి. భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫోటో ముద్రించాలని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ,వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి చిన్న కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం కు జ్ఞానమాల (78) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. రిజర్వ్ బ్యాంక్ స్పూర్తి ప్రదాత అంబేడ్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించక పోవడం విచారకరమన్నారు. ఏదైనా ఒక నోటు పై డాక్టర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంబేడ్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని రాష్ట్రపతి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, మరియు ప్రధాన మంత్రి కి ఉత్తరాలు రాసి, ఉద్యమానికి మద్దతు తెలిపారని గుర్తు చేసారు. భారత కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రించే వరకు పోరాటం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ జ్ఞానమాల కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి (CAPSS) జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, జిల్లా గౌరవ అద్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు రావుల రాజు, మహ్మద్ సలావుద్ధీన్, సిరికొండ శివకుమార్, పల్లెర్ల వెంకటేష్.సూదగాని మధు, టీ వెంకట్ ,పోలేపల్లి మైసయ్య ,ముడుగుల శంకర్, తదితరులు పాల్గొన్నారు..