రాయల్ పోస్ట్ న్యూస్: మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ లను వెంటనే అరెస్టు చేయాలని, మత విద్వేష వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించి, రాజ్యాంగ విలువలను కాపాడాలని భువనగిరి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తు వారిపై భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మతవిశ్వాసాలను, నమ్మకాలను దుర్వినియోగం చేయడం ఉచ్ఛ స్థితికి చేరుకున్నది. బిజెపికి చెందిన నేతలు ఒకరిని మించి ఒకరు మతవిద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, విద్వేషాలు రెచ్చగొట్టడంలో పోటీ పడుతున్నారు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు “మసీదులను తవ్వితే శవాలు బయట పెడితే మీవి, శివాలు బయటపడితే మావి” అని విద్వేష ప్రసంగం చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బిజెపి అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ ఇంతకంటే ఇంకా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయాలనే ఉద్దేశంతో మహమ్మద్ ప్రవక్త మీద మరింత విద్వేష ప్రకటనలు చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. 57 అరబిక్ దేశాలు తమ నిరసన తెలియజేశాయి. దీంతో బిజెపి తన జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న నుపూర్ శర్మ ను, ఢిల్లీ బిజెపి నాయకుడు నవీన్ జిందాల్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అరాచక శక్తులతో తమకు సంబంధం లేదు అని ప్రకటించింది. అయితే వారిపై కేసులు పెట్టి, అరెస్టు చేసి కఠినంగా శిక్షించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇది సరైంది కాదు. గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ విధానం వల్లనే దేశంలో ఇలాంటి దుస్థితి నెలకొంది. ప్రపంచ దేశాల ముందు తలవంపులు తెస్తున్నది. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలు ప్రసార మాధ్యమాలలో, సోషల్ మీడియాలో విస్తృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దేశాభివృద్ధికి, శాంతియుత సహజీవనానికి ఈ పరిణామాలు ఎంత మాత్రం క్షేమం కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సమిక్షించుకొని మత విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించి, భారత రాజ్యాంగ విలువలను, వేల సంవత్సరాలుగా వస్తున్న బహుళ సంస్కృతుల సహజీవన సాంప్రదాయాన్ని కాపాడాలని భువనగిరి ముస్లిం జేఏసీ తరుపున కోరుతున్నాము.ఈ కార్యక్రమం లో ముస్లిం నాయకులు అఫజల్, మాజహార్, తాహేర్, కాజమ్, అమీరుద్దీన్, ముజీబ్, జాహేద్, ఇస్మాయిల్, అహ్మద్, అతహర్, హరూన్, షరీఫ్,అమీన్,ఆఫ్సర్, సలాఉద్దీన్, రషీద్,వసీమ్,అజహార్, మునీర్, బుర్హాన్, ముస్లిం యువత పాల్గొన్నారు…