గుండాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రాచకొండ కమిషనర్
గుండాల జూన్ 13(రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి)
గుండాల మండల పోలీస్ స్టేషన్ వరంగల్ కమిషనరేట్ నుండి రాచకొండ కమిషనరేట్ విలీనం చేసినాక మొదటిసారిగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సోమవారం రోజున గుండాల పోలీస్ స్టేషన్ సందర్శించారు. వారు పోలీస్ స్టేషన్ పరిసరాలు మరియు స్టేషన్ రికార్డులను పరిశీలించిన తర్వాత వారు మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. ప్రజలకు 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. రాచకొండ పరిధిలోని ఆలేరు పోలీస్ స్టేషన్ ఉత్తమ అవార్డు పొందిందని అదేవిధంగా గుండాల పోలీస్ స్టేషన్ కూడా సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా డి సి పి నారాయణ రెడ్డి ఏసీపీ సైదులు సీఐ నవీన్ రెడ్డి గుండాల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ యాకయ్య జమిందార్ ప్రకాష్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.