ఎర్దనూర్ దళితుల భూములు గుంజుకుంటున్న క్రషర్ యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలి


రాయల్ పోస్ట్ ప్రతినిధి కంది
ఎర్దనూర్ దళితుల భూముల జోలికి వస్తే ఆర్డీఓ,మైనింగ్ కార్యాలయాలను ముట్టడిస్తాం

కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్
కంది మండలం ఎర్దనూర్ గ్రామంలోని సర్వే నంబర్స్ 231,259 లో ప్రభుత్వ భూముల్లో 2005 లో ఎస్సీ ఎస్టీ బీసీలకు పట్టాలు ఇచ్చిన భూములను క్రషర్లకు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు రైతులు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చారు.భూములు కోల్పోతున్న మహిళ రైతులకు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్, అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపూర్ జగన్ లు మాట్లాడుతూ దళితుల భూములు కబ్జాలకు పాల్పడుతున్న క్రషర్ ఓనర్ లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వ్యవసాయం చేసుకుంటు, భూములే జీవనాధారంగా బతుకుతున్న పేదల పొట్టలు కోడుతున్నారని అన్నారు.పేదల భూములు గుంజుకొని క్రషర్ ఓనర్ లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు. క్రషర్ ఓనర్లు వచ్చి భూముల నుండి పేదలపై దౌర్జన్యం చేసి వెళ్లగొట్టడం దారుణం అన్నారు ఇప్పటికే అక్కడ నడుస్తున్న క్రషర్ లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయి అని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవి పట్టి పట్టాని రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఇంకా అనేక క్రషర్ కంపెనీలకు అనుమతివ్వడం చూస్తే రైతులు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు ఉందని అన్నారు 2013 భూ సేకరణ చట్టం ఉన్న రెవెన్యూ అధికారులు అమ్మలు చేయడం లేదని అన్నారు 2013 భూ సేకరణ చట్టం తుంగలో తొక్కి అధికారులు పేదల భూములు గుంజుకొని క్రషర్ కంపెనీలు అప్పజెప్పడం మర్మమేమిటో విచారణ జరపాలని అన్నారు ఇందులో అవినీతికి పాల్పడిన రెవెన్యూ మైనింగ్ అధికారుల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేదల భూముల జోలికి వస్తే ఆర్డీవో,మైనింగ్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దుర్గాప్రసాద్, సురేష్, మహిళ రైతులు తదితరులు పాల్గొన్నారు