నారాయణఖేడ్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాయల్ పోస్ట్ ప్రతినిధి;నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో, 8వ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి, జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది, అనంతరం, స్వీట్లు పంచి, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం తెలంగాణ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు,
*తాసిల్దార్ కార్యాలయం వద్ద, మున్సిపల్ , ఆర్డిఓ , కార్యాలయం , మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో జరిగిన జెండా ఆవిష్కరణ, కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.