రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

ఆలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీర్ల అయిలయ్య

గుండాల,మే31(రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిది):వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేసిన రాహుల్ గాంధీ పిలుపుమేరకు ఆలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీర్ల అయిలయ్య,అండెం సంజీవరెడ్డి సంయుక్తంగా గుండాల మండలం లోని అనంతారం గ్రామం నుండి మండల కేంద్రం వరకు రైతుల సంక్షేమం కొరకు ప్రకటించిన పది రకాల మద్దతు ధర ప్రకటనల గురించి గ్రామ గ్రామాన తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ తో పాటు ప్రకటించిన పది రకాల పంటలకు కు మద్దతు ధర ఇస్తామని భూమి లేని రైతులకు రైతు బీమా తో పాటు ఉపాధి హామీ పథకంలో నమోదైన ప్రతి కూలికి 12 వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని,పోడు భూములకు అసైన్డ్ భూములకు యజమాని హాక్కు కలిగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.వరంగల్ రచ్చ బండ కార్య క్రమంలో రాహుల్ గాంధీ రైతు సంక్షేమం కై ఉత్సాహం చూపారని రాబోయే కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీర్ల పౌండేషన్ ఛైర్మన్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళ వారం అనంతారం, సుద్దాల, బ్రాహ్మణ పల్లి, రామారం, గుండాల వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి, పాచిల్ల హేమావతి ఫంక్షన్ హాల్లో జరిగిన రచ్చబండ కార్య క్రమంలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ రైతుల మేలు కోరి రైతుల పక్షాన నిలుస్తుందని అన్నారు. నాటి కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ హాయంలో గరీబీ హటావో అంటూ పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పనిచేసి ప్రజల పక్షాన వెన్నుదన్నుగా నిలబడి పని చేశారని అన్నారు. నేటి ప్రభుత్వాలు అవి మరచి ఓట్లే పరమ ధ్యేయంగా అక్రమంగా ప్రజలను వంచించి సంపాదించిన డబ్బును సామాన్యుడు ప్రత్యక్ష ఎలక్షన్ లో నిలబడి గెలవలేని పరిస్థితిలో ఈనాడు ప్రజలకు గుదిబండగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మారాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష రూపాయల రుణ మాఫీ ఇచ్చి రైతులకు ఎంతో మేలు చేశారని, రాహుల్ గాంధీ ప్రకటించిన రెండు లక్షల రుణ మాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే తొలి సంతకం పెట్టి రుణమాఫీ వర్తింప చేస్తామని అన్నారు. ఇటీవల వరంగల్లో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో మాట్లాడుతూ టీ కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉంటానని, ఆలేరు నియోజక వర్గంలో ప్రతి కార్యకర్త కు అండగా నిలుస్తానని అన్నారు. గుండాల మండలం లో ప్రతి ఇంటింటికి తిరిగి రాహుల్ డిక్లరేషన్ హామీలను ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నామని అన్నారు. తన బిర్లా ఫౌండేషన్ ద్వారా రామారం గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ఒక లక్ష రూపాయల బాండ్లను ఇద్దరు బాలికలకు 50 వేల చొప్పున డిపాజిట్ చేసి బాండ్లను అందజేశారు. ఈ ప్రాంత వాసులకు బీర్ల ఫౌండేషన్ ద్వారా అన్ని రకాల సేవలను అందిస్తామని హామీ ఇచ్చారు. వివిధ పార్టీల నుండి సుమారుగా 350మంది చేరిన కార్యకర్తలను కండువాలు కప్పి స్వాగతించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సింగిల్విండో చైర్మన్ లింగాల బిక్షం,సర్పంచులు డెన్నిస్ రెడ్డి,ఏలూరు రామ్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాజ రత్నం మాజీ ఎంపిపి ధ్యాప కృష్ణారెడ్డి, బీర్ల ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఈరసరాపు యాదగిరి గౌడ్ అనపర్తి యాదగిరి,పురుగుల మల్లేశం, ఎన్ఎస్ యుఐ నాయకులు ఆవుల సాయి ప్రసాద్,ఎంపీటీసీలు రవి కుమార్, అలివేలు వెంకటాద్రి, జోగ శ్రీశైలం, ఊట్ల పాండరి, రామ చంద్ర,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.