ముఖ్యమంత్రి దత్తతా గ్రామం వాసాలమర్రి పునర్నిర్మాణంను ఎన్నికల్లోపు పూర్తి చేయాలి…..

కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం వేస్తున్న రోడ్డు విస్తరణలో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు….

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి డిమాండ్…..

రాయల్ పోస్ట్ న్యూస్: యాదాద్రి నుండి ఎర్రవెల్లి లోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ వరకు వేస్తున్న రోడ్డు విస్తరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి అన్నారు సీఎం కేసీఆర్ దత్తతా గ్రామం వాసాలమర్రి తో పాటు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దత్తతా గ్రామమైన కొండాపూర్ గ్రామాల్లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులతో స్థానిక గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండాపూర్,వాసాలమర్రి నుండి వయా తుర్కపల్లి మీదుగా యాదగిరిగుట్ట వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను పాత అలై న్ మెంట్ ప్రకారమే చేపట్టాలని ప్రభుత్వాన్ని ,అధికారులను డిమాండ్ చేశారు గతంలో 66 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేస్తున్న ట్లు అలైన్ మెంట్ చేసి ఇల్లు కూల్చి వేసి ఇప్పుడు మూల మలుపులను తొలగించి రోడ్డు సీదాగా ఉండేలా చేస్తూన్నామని పేర్కొంటూ ఇళ్ల ముందుకు వచ్చేలా దౌర్జన్యం గా రోడ్డు పనులు చేపట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి సరైన పరిహారం ఇవ్వాలని అదేవిధంగా అలైన్ మెంట్ ప్రకారమే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు కేసీఆర్ దత్తతా గ్రామం వాసాలమర్రి గ్రామ పెద్దలు, యువకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో మ్యాన్యువల్ లో ఉండి ఆన్ లైన్ లో లేని సుమారు వంద ఇళ్లను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని కొత్త లే అవుట్ వేస్తే గ్రామంలోని ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చూడాలని ఇంటి స్థలానికి ఇంటి స్థలంతో పాటు భూమి కోల్పోతే భూమికి భూమిని చూపించాలని పేర్కొన్నారు గ్రామస్తుల డిమాండ్ మేరకు వచ్చే ఎన్నికల్లోపే గ్రామ పునర్నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు లేని పక్షంలో ఆయా గ్రామాల నిర్వాసితులతో కలిసి సీఎం కెసిఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఆయన వెంట తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్,మండల కాంగ్రెస్ నాయకులు ఓర్సు భిక్షపతి,నల్ల బాలక్రిష్ణ,యాదగిరి, వెంకట స్వామి, వాసలమర్రి,కొండాపూర్ గ్రామస్థులు ఉన్నారు