కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ పోటో ముద్రించే వరకు పోరాడుదాం……శాంతి కుమార్.

భారత కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రించే వరకు మనమంతా కలిసి పోరాడాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ ఉప్పుల శాంతి కుమార్

పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం కు జ్ఞానమాల (76) సమర్పించిన అనంతరం ఆయన మాట్లడారు.రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేసిన అంబేడ్కర్ పోటో, రిజర్వ్ బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై లేకపోవడం విచారకరమన్నారు. తెలంగాణా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటు లో నిర్ణయం తీసుకొని భారత కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ పోటో ముద్రించాలని డిమాండ్ చేశారు. ఈ జ్ఞానమాల కార్యక్రమం లో కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి (CAPSS) జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, జిల్లా అద్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు బండారు శివ శంకర్, రావుల రాజు, ముడుగుల శంకర్, సూరారం జానీ,దాట్ల సుమన్ ,భగవాన్, జానీ,సందీప్,చంద్రశేఖర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.