వర్ధంతి సందర్భంగా 12 వేల మందికి పైగా అన్నదానం.
రాయల్ పోస్ట్ న్యూస్:యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో సిరి సోలార్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గౌతమ్ జైన్ ,కౌకుర్ వాస్తవ్యులు వారి నానమ్మ కీర్తిశేషులు కమలాబాయి రెండవ వర్ధంతి సందర్భంగా చీకటిమామిడి గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు బొర్ర కృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతం జైన్ మాట్లాడుతూ మా నాన్నమ్మకు గుర్తుగా చీకటిమామిడి గ్రామం తో పాటు దేశమంతటా 38 స్థలాలలో 15 వేల మందికి పైగా ప్రజలకు అన్నదానం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సర్పంచ్ మచ్చ వసంత శ్రీనివాస్, గొడుగు శోభ, చంద్రమౌళి వైస్ ఎంపీపీ, జహంగీర్ హలీమా బేగం ఉపసర్పంచ్, బలిజ రాజు కట్ట రాజు, తిప్పారం బాను ప్రకాష్, నంద రాజు గౌడ్, బూడిద శ్రీనాథ్, కడారి నవీన్, జూపల్లి శ్రీకాంత్, కట్టనరసింహ, బొర్ర నరసింహ, బొర్ర మహేష్, బొర్ర వెంకటేష్, మోత్కుపల్లి శివ, మరియు రాజు పాల్గొని నివాళులర్పించారు.