మేడ్చల్ మండలం బండమాదారం గ్రామ పంచాయతీ సిబ్బంది విద్యుత్ ప్రమాదంతో మృతి
రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలంలోని బండమాదారం గ్రామం గ్రామ పంచాయతిలో పారిశుధ్యం మరియు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న దుందిగల్ల రాములు తండ్రి పోచయ్య, వయస్సు: సుమారుగా 46 సంవత్సరములు,
విది నిర్వాహణలో భాగంగా ఈరోజు ఉదయం నిచ్చన సహాయంతో వీధి దీపాలు బిగుస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా జరిగి స్తంభం మీద నుండి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామ సర్పంచ్ భర్త సామల ప్రభాకర్ రెడ్డి గారు 108 అంబులెన్స్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో వారు గాయపడిన రాములును గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
జరిగిన ప్రమాదాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.