ఎలిమినేటి మదుసూదన్ రెడ్డికి డాక్టరేట్ అవార్డు ప్రదానం

రాయల్ పోస్ట్ ప్రతినిధి:ఈ నెల మే 21 , 2022 , యునివర్శిటీలో పి.హెచ్.డి ఫైనల్ సెమినార్ లో స్వామి వివేకానంద ఫార్మసీ కళశాల – వంగపల్లి , యాదగిరిగుట్ట , జిల్లా యదాద్రి భువనగిరిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిమినేటి మధుసూదనరెడ్డికి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఎస్ జె జె టి యు – రాజస్థాన్ నుండి ఫార్మసీ విభాగంలో డాక్టరేట్ ( పి.హెచ్.డి ) అవార్డు లభించింది . అతను సమర్పించిన పరిశోధన వ్యాసం “ఇవాల్యుయేషన్ ఆఫ్ న్యూరో ప్రొటెక్టీవ్ అండ్ అన్టీ అల్జీమర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్స్ ” యునివర్శిటీ ద్వారా ఆమోదం పొందినది .ఈ పరిశోధన 2017 లో యునివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ కుమార్ జాట్, ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ హరికిరణ్ పర్యవేక్షణలో మొదలై 2022 లో సమర్పించారు . డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్బంగా కుటుంబ సభ్యులు , మిత్రులు, కళాశాల బృందం ఎలిమినేటి మదుసూదన్ రెడ్డికి అభినందనలు తెలిపారు .