హమాలి కూలీ రేట్లు పెంచాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా ..
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సివిల్ సప్లయి కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు క్వింటాకు రూ.30/-కు పెంచి ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి MD. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈరోజు సోమవారం కూలి రేట్లు పెంచాలని సివిల్ సప్లయి హమాలి యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా భువనగిరి లోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ కొప్పుల వెంకట్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ సివిల్ సప్లయి కార్పొరేషన్ లో హమాలీలుగా పనిచేస్తున్న కార్మికులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి G.O నెంబర్ 26 ప్రకారం హమాలి రేట్లు పెంచబడుతున్నాయి, గతంలో పెంచిన రేట్లు పెరుగుతున్న ధరలకు ఏ మాత్రం సరిపోవడం లేదు, అందులో భాగంగా గతంలో చేసిన ఒప్పందం ప్రకారం డిసెంబర్ 2021తో గడువు ముగిసింది,5 నెలలు దాటినా కూలి రేట్లు పెంచలేదని వెంటనే కూలి రేట్లు క్వింటాకు రూ.30/-కు పెంచాలని,భువనగిరి లో సొంత గోడౌన్ నిర్మించుటకు స్థలం కేటాయించాలని, బోనస్ రూ.10 వేలు ఇవ్వాలని, అందరికీ ESI సౌకర్యం కల్పించాలని,60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి రూ.5వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కారిక్రమంలో హమాలీ కార్మికులు ముదిగొండ బసవయ్య, పాశం అంజయ్య, చొప్పరి సత్తయ్య, సత్యనారాయణ, శీను,రాజు,జహంగీర్, పరశురాములు,గణేష్,రాజు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.