విశ్వబ్రాహ్మణ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పోలోజు మౌనిక
……………………………
రాయల్ పోస్ట్ ప్రతి నిధి యం. ఎ. అజీజ్.
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు సూర్యాపేటకు చెందిన పోలోజు మౌనిక ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన విశ్వబ్రాహ్మణ ,విశ్వకర్మ, ఐక్య సంఘం సమావేశంలో ఏకగ్రీవంగా నిర్వహించారని ఆమె విలేకరులకు తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారని తెలిపారు.ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ తన ఎన్నిక సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. విశ్వబ్రాహ్మణ,విశ్వకర్మ, ఐక్య సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమెని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.