రేపటి ధర్నాను జయప్రదం చేయండి రాయల్ పోస్ట్ ప్రతి నిధి యం. ఎ. అజీజ్ సూర్యాపేట ……ఎర్ర అఖిల్ CPI (M L) ప్రజా పంథా జిల్లా నాయకులు

సూర్యాపేట పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి అని, అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని రేపు మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ముందు జరగబోయే ధర్నాను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కుడకుడలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు ఎర్ర అఖిల్ పిలుపునిచ్చారు
సూర్యాపేట నెలకొన్న అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు అని ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ముందు CPI (M.L) ప్రజా పంథా ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నామని దీనికి పార్టీ ముఖ్య నాయకులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు, రాష్ట్ర నాయకులు G.వెంకటేశ్వరరావు గారు అటెండ్ అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో IFTU జిల్లా కన్వీనర్ రామోజీ,POW నాయకులు రేణుక, కవిత, బాలాజీ, పట్టణ నాయకులు Jaangir,PYL నాయకులు కొత్తపల్లి వేణు తదితరులు పాల్గొన్నారు