రాయల్ పోస్ట్ ప్రతి నిధి యం. ఎ. అజీజ్ సూర్యాపేట…..చలో ప్రగతి భవన్ ముట్టడిని విజయవంతం చేయండి -PDSU సూర్యపేట జిల్లా అధ్యక్షుడు పోలేబొయిన కిరణ్*

నిరుద్యోగ,విద్యారంగ సమస్యల పరిష్కారానికై మే 23న చలో ప్రగతి భవన్ ముట్టడి విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షడు పోలేబొయిన కిరణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగలను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లను రద్దు చేయాలని , ఫీజుల దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని, ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ సెంటర్లను నడిపించి , వసతి సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలని, ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ యూనివర్సిటీని నెలకొల్పి, రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ దందాపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి, పెండింగ్లో ఉన్న 4000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్స్ లని వెంటనే విడుదల చేయాలని,శ్రీ చైతన్య , నారాయణ తదితర కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలని తదితర డిమాండ్స్ తో ఈ నెల 23 న PDSU , PYL తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ ప్రగతి భవన్ ముట్టడికి నిరుద్యోగులు , విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివెళ్లి ఈ ముట్టడికి విజయవంతం చేయగలరని కోరారు.