యుద్ధం మిగిలే వుంది.. ప్రభాకర్ అన్న ఉద్యమ స్పూర్తితో ఉద్యమిద్దాం!
-కుంట్ల ధర్మా ర్జున్ తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*రాయల్ పోస్ట్ ప్రతి నిధి యం. ఎ. అజీజ్ సూర్యాపేట…
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సూర్యాపేట ప్రాంతంలో జేఏస నేతగా మండారి ప్రభాకర్ క్రియాశీలక పాత్ర పోషించారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ అన్నారు. మండాది ప్రభాకర్ మూడో వర్ధంతి సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సహచర ఉద్యమకారులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రభాకర్ కు ఘన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ ప్రభాకర్ ఏ ఆశయ సాధన కొరకు అయితే తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడో వాటిక తూట్లు పొడిచిన ఈ ప్రభుత్వంలో
ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షకు ఇంకా అడుగులు పడలేదు. చీమలు పెట్టిన పుట్టల్లో విషసర్పాలు జొరబద్డ్డాయి. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నఅమరుల త్యాగాలను అవమాన పరుస్తూ బేసిన్ లు లేవు భేషజాలు లేవు అంటూ కే సి ఆర్ నిస్సిగ్గుగా తన దళారీ స్వభావాన్ని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నాడు అని విమర్శించాడు. కాంట్రాక్టు ల కమీషన్ లకోసం ప్రాజెక్టు లనిర్మానాలన్ని సీమాంధ్రులదోపిడీ దారులకు ఇస్తున్నాడు.కృష్ణా జలాలను ఆంధ్ర పాలకుడు దోసుకు పోతుంటే మౌనంగా ఉంటూ వారికి తన ఘడీలోకి ఎర్ర తివాచీ స్వాగతం. మరోవైపు కృష్ణా, గోదావరి జలాల తో సహా అన్ని జలవనరుల పై మొత్తం ఆదికారాన్ని ఢిల్లి గద్దె గుంజుకు పోతుంటే పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు అన్నా డు 317జీఓ తో ఉద్యోగుల స్తానికథనే ప్రశ్నార్థకం చేసిండ్రు అని విమర్శించారు.. తెలంగాణను అప్పులకుప్పగా మార్చాడు .నియామకాలకు తిలోదకాలు ఇచ్చాడు. ప్రాజెక్ట్ లపేరుతో డబ్బుదండు కుంటు నీళ్లను ప్రశ్నార్థకం. చేసిండు. తనకుటుo బం కోసం . తనరాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని ఇంకా యుద్ధం మిగిలే వుందని ప్రభాకర న్న స్పూర్తి తో ప్రజా స్వామిక తెలంగాణ సాధనకోసం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు ఎర్ర మల రాములు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ జనసమితి రాష్త్ర నాయకులు గట్ల రమశంకర్, జిల్లా అధ్యక్షుడు మాంద్ర మల్లయ్య, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు తండు నాగరాజు, జిల్లుపద్యక్షుడు కంబాలపల్లీ శ్రీను , యువజన సమితి రాష్త్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్, విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షుడు వినయ్ గౌడ్, ఉపాధ్యక్షుడు వినయ్ గౌడ్, యాకూబ్ రెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు