పబ్లిక్ క్లబ్ ను అబ్దుతమైన రిక్రియేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలి -రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యాపేట,23/05/2022
సూర్యాపేట: పబ్లిక్ క్లబ్ ను అబ్దుతమైన రిక్రియేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం సాయంత్రం పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గతంలో క్లబ్ లను పేకాట స్థావరాలుగా తయారు చేసి,కుటుంబ సభ్యులకు క్లబ్ లంటే అసహ్యభావం వచ్చేలా చేసారనిగుర్తుచేశారు. మానసిక ఒత్తిడిని దూరం చేసే రిక్రియేషన్ సెంటర్ గా ఆదర్శవంతంగా చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో కుటుంబ సభ్యులతో క్లబ్ కు వచ్చి సంతోషాన్ని పంచుకునే స్థాయికి తీసుకురావాలని నూతన కమిటీకి సూచించారు. ముందుగా నూతన కమిటీ తో ఆర్డీవో రాజేంద్రకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం క్లబ్లో వ్యాయమశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, జనరల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి గణేష్, వైస్ ప్రెసిడెంట్ పెండెం చంద్ర శేఖర్, సంయుక్త కార్యదర్శి దాసరి వెంకట శ్రీనివాస్, కోశాధికారి బోనగిరి భాస్కర్, కార్యవర్గ సభ్యులు పోలేబోయిన విశ్వబల, చిలుముల సునీల్ రెడ్డి, మాలి అనంతరెడ్డి, మాదంశెట్టి వీరయ్య, కెక్కేరేణి సత్యనారాయణ గౌడ్, చెరుకు శ్రీను, చిప్పలపల్లి జయ శంకర్, ఎస్కె తాహెర్ పాషా, గుండపనేని కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.