ధరావత్ ద్వాళి 100వ జన్మదిన వేడుకలు

పాల్గొన్న ఐదు తరాల కుటుంబ సభ్యులు

తండాలో పండుగ వాతావరణం*రాయల్ పోస్ట్ ప్రతి నిధి యం. ఎ. అజీజ్ సూర్యాపేట…

150 మంది మనుమల్లు, మనుమరాళ్ళు కలవడంతో ఆ తండాలో పండుగ వాతావరణం,ఐదు తరాల కుటుంబ సభ్యులు పాల్గొనడంతో తండా అంతా సందడే సందడి,ఇంతకీ ఆ తండాలో పండుగ కాదు, పెళ్లి కాదు, 100వ పుట్టినరోజు వేడుక. బంజారా నృత్యాలతో వేడుకల్లో పాల్గొన్న వంద సంవత్సరాల వృద్ధురాలు. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం,పులితండా గ్రామపంచాయతీ పరిధిలోని బడి తండా లో ఆదివారం పండుగ వాతావరణం నెలకొంది. దరావత్ ద్వాళి వంద సంవత్సరాల పుట్టిన రోజు వేడుకలను 5 తరాల కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో వృద్ధురాలుచే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధురాలు బంజారా నృత్యాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ధరావత్ ద్వాళి,హనుమంతు నాయక్ లకు కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ తనకు కలిగిన నలుగురు మగ సంతానం, ఏడుగురు ఆడ సంతానం సాకుతూ వచ్చారు. వారికి విద్యాభ్యాసం నేర్పించి పెద్దవాళ్లను చేశారు.నాలుగో కుమారుడు రెడ్యా నాయక్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లో సూపరింటెండెంట్ గా పని చేస్తున్నాడు. ఆడ సంతానం లో ఏడవ కుమార్తె బుజ్జి టీచర్ గా పనిచేస్తుంది. 11 మందికి కలిగిన సంతానంలో సుమారు 30 మంది వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తం 150 మంది మనుమల్లు, మనుమరాళ్ళు,ముని మనమల్లు,ముని మనవరాళ్లు, ముని ముని మనుమల్లు, ముని ముని మనవరాళ్ళు, తదితరులు పాల్గొనడం తో తండావాసులంతా ఓ పండగ వాతావరణంలో ఆనందంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం పరిసర ప్రాంత ప్రజలను ఆకట్టుకుంది.