మాదిగల డిమాండ్ లక్ష్య సాధనే ధ్యేయంగా చలో భువనగిరి.

రాయల్ పోస్ట్ ప్రతినిధి బొమ్మల్టమారం :ఎస్సీ వర్గీకరణ మాదిగల డిమాండ్ల సాధన లక్ష్యంగా ఈ నెల 12వ తేదీన భువనగిరిలో జరుగు పార్లమెంట్ స్థాయి సదస్సును జయప్రదం చేయాలని బొమ్మలరామారం మండలం జలాల్పూర్ గ్రామ ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రంగపురం స్వామి మాదిగ కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు చేసిన 100 రోజుల లోపే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి తన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గార్లు ఎస్సీ వర్గీకరణ విషయంలో అలసత్వం వహిస్తే వచ్చేఎన్నికలలో మాదిగలు బిజెపికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.తెలంగాణ ప్రభుత్వం 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన దళిత బంధు పథకం అర్హులైన వారందరినీ గుర్తించి అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని అన్నారు. డిమాండ్ల సాధన లక్ష్యంగా మేడి పాపయ్య మరియు వంగపల్లి శ్రీనివాస్ మాదిగల నాయకత్వంలో మాదిగల హక్కుల సాధనకై ఈ నెల 12న భువనగిరి పార్లమెంట్ కేంద్రంలో జరిగే ఈ సదస్సుకు బొమ్మలరామారం ప్రాంతం నుండి అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊట్లరమేష్, పరిధప్రదీప్ కుమార్, సంధగల మైసయ్య,పులిగిల్ల శీను, యాదగిరి, నల్ల యాదగిరి,ఇస్తారి, బాబు,మహేందర్, చంద్రయ్య, కిషోర్ ,నరసింహ, కృష్ణ,స్వామి, అశోక్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.