ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన చైర్మన్ లింగాల భిక్షం గౌడ్

గుండాల మే 08(రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి) గుండాల మండలంలోని వస్తాకొండూర్ గ్రామంలో పీఏసీఎస్ (సింగిల్ విండో బ్యాంక్) చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ ఆధ్వర్యంలో మంజూరు అయిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాలు,తేమ శాతం తగ్గించి సెంటర్ లకు ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ పాలబిందెల లక్ష్మయ్య, మహేశ్వరం శ్రీనివాస్ రెడ్డి, గణగాని వెంకన్న,నరేష్ తదితరులు పాల్గొన్నారు.