దళితులకు కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర1ప్రభుత్వాలు… బర్రె జహంగీర్.. మాజీ మునిసిపల్ చైర్మన్ భువనగిరి
తెలంగాణ రాష్ట్ర పర్యటన ముగించుకొని వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కలిసి వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన కృతజ్ఞతలు తెలియజేస్తూ దళిత అభివృద్ధికి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ… ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే.. కేసీఆర్ ప్రభుత్వం పోలీసులతో దాడులు చేసి.. అసైన్డ్ వివిధ రకాల భూములను లాక్కుంటున్నారని, మీ నాయనమ్మ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల అభ్యున్నతి కోసం దేశ బడ్జెట్ లో ప్రత్యేకంగా స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ తీసుకు వచ్చిన దానికి స్ఫూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సబ్ ప్లాన్ నిధులను కేటాయించి ప్రతి సంవత్సరం అభివృద్ధికి ఖర్చు చేయాలని లేకపోతే క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే సంవత్సరం నిధులను ఖర్చు చేసే విధంగా చట్టాలు తీసుకువస్తే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అదే మాదిరిగా దళితులకు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి కేవలం 6662 కుటుంబాలకు 16, 544.13 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేసి కేవలం 511 మంది లబ్ధిదారులకు 112 ఎకరాల భూమిని నేటికీ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు దాదాపు లక్ష ఉద్యోగాలు పూర్తి చేయకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లు 124 హాస్టళ్లకు సొంత భవనాలు 80% హాస్టళ్లలో మౌలిక వసతులు లేక దళిత విద్యార్థులు పడుతున్న బాధ వర్ణనాతీతం కాబట్టి అనేక విషయాలలో దళిత గిరిజనుల పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంపై మెడలు వంచే విధంగా తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవింప చేయుటకు తమరు దళిత నాయకత్వాన్ని పెంపొందించడం కోసం దళితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తీరును శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలుకుతూ రాహుల్ గాంధీకి, బర్రె జహంగీర్ భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ వివరించారు. దళిత బంధు పేరుతో మరోసారి దళితులను మోసం చేసే కుట్ర ప్రభ్వత్వం చేస్తోందన్నారు. గతంలో ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ కొనసాగిస్తూ దళితుల సంక్షేమానికి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. ఇందిరమ్మ హయాంలోనే పక్కా ఇండ్లను తీసుకొచ్చిందన్నారు. 54 ఎకరాల కంటే ఎక్కువుంటే లాక్కొని అసైన్డ్ ల్యాండ్ గా ఏర్పాటు చేసి.. దళిత, గిరిజనులకు భూములు పంచిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో అసైన్డ్ పోడు భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో నైనా దళితులకు జిల్లా అధ్యక్ష పదవులు కేటాయించాలని, రాష్ట్ర పిసిసి కార్యవర్గంలో బూత్ స్థాయి వరకు దళితులకు బాధ్యత అప్పజెప్పాలని అప్పుడే టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పినట్లు ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థను కేసీఆర్‌ నడిపిస్తున్నారని వివరించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దళితుల ఉజ్వల భవిష్యత్తుకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.